నిజం
నిజం
నీకు నీవు తిరగులేని గురువన్నది.. పచ్చి నిజం..!!
నీ మనసే అసలు కల్పతరువన్నది.. పచ్చి నిజం..!!
ఆశ వలన అలసటలే మిగులు చూడు ఎపుడైనా..!!
వెర్రి మొర్రి కోరికలే బరువన్నది.. పచ్చి నిజం..!!
కొండ దూకు సెలయేరుకు ఏ లక్ష్యం కలదోయీ..!?
సహజముగా బ్రతుకుటయే తెరువన్నది.. పచ్చి నిజం..!!
కలలు కంటు కూర్చుంటే పెరుగు కదా బద్ధకమే..!!
పని చేసే తత్వమదే మెరుగన్నది.. పచ్చి నిజం..!!
మాటలతో యుద్ధాలను సృష్టించడమెందుకోయి..?!
మౌనం తో స్నేహమదే తగునన్నది.. పచ్చి నిజం..!!
