STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Inspirational

4  

Dinakar Reddy

Abstract Drama Inspirational

నిజాయితీ

నిజాయితీ

1 min
287

ఈ కాలంలో కూడా..

రేపు స్కూలు ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వరు

పండక్కి కొత్త బట్టలు కొనాలి

నల్ల పూసల దండయినా లేకుండా పెళ్లికి ఎలా వెళ్ళడం


అమ్మను వేరే హాస్పిటల్లో చూపిద్దామా

మందుల షాపుల్లో నీకు తెచ్చే మందులకు డిస్కౌంట్ లేదు నాన్నా


విహారయాత్రకు డబ్బులు కట్టి పేరు వ్రాయించాలి

కొత్త బకెట్ తీసుకో

కిరాణా షాపుల్లో కూడా అన్నీ ఖరీదు పెరిగాయి 


ఇవాళ ఆఫీసులో పార్టీ ఇమ్మన్నారు 

బండి బాగు చేయించడానికి డబ్బు సరిపోదు

కొద్ది రోజులు ఆఫీసుకు నడిచి వెళతాలే

ఎవరైనా అడిగితే ఆరోగ్యం కోసం అని చెప్పొచ్చు


సినిమా టీవీలో చూడొచ్చు

హాలు దాకా ఎందుకు

దినం(పెద్ద కర్మ) రోజు పో సరేనా

ఇప్పుడు పూల దండ వేయకపోతే బాగుండదు


ప్రత్యేక దర్శనం అంటే కష్టమే

సేవ చేయగలను కానీ దానం..?


ఒకటా రెండా

పొద్దున్న లేస్తే అవసరాల ఆక్రోశాలు

నిద్ర పోయేంత వరకూ గుర్తుండే అప్పుల చిట్టాలు


నొప్పింపక తానొవ్వక

అలాగని తప్పించుకోవడమూ కుదరక

తానేమిటో తన స్థితి ఏమిటో తెలిసీ వచ్చే ఇబ్బందుల నోరు మూయ(లే)క

నిత్యమూ సతమతమయ్యే ఓ సగటు మనిషీ


ఏ స్థితిలోనూ వదలని నిజాయితీ 

ఆభరణంగా ఒకసారి

అధైర్యంగా మరోసారి

ఇంకెన్నో రూపాలు 

మరెన్నో వేషాలు

ధర్మ పరీక్షలో నిత్యమూ ఆత్మవిమర్శల శూలాల్ని ఎదుర్కొని

చిరునవ్వు చెదరనీయని 

ఓ బాటసారీ

నీ ప్రయాణానికి అందుకో ఈ వందనం



Rate this content
Log in

Similar telugu poem from Abstract