నీదయ
నీదయ
మనసే వీణగ..అందెను నీదయ..!
రాగం మధువై..పొంగెను నీదయ..!
మాటల ఊటను..చూస్తూ ఉంటిని..
మల్లెల వానయె..కురిసెను నీదయ..!
ప్రేమకు రూపం..నీవని తెలిసెను..
మమతల ఊయల..దొరికెను నీదయ..!
రాలిన పూవుల..కథలే మధురం..
విరహపు వంతెన..నవ్వెను నీదయ..!
చేదుగ మిగిలిన..గతమది చిత్రము..
వింతగ తియ్యగ..మారెను నీదయ..!
సీతకు శోకము..నాటక భాగము..
అశోక వనమది..చాటెను నీదయ..!