STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Inspirational Others

4  

VENKATALAKSHMI N

Abstract Inspirational Others

నీ స్నేహం

నీ స్నేహం

1 min
3.9K

నమ్మకమనే పునాదులపై

నీతి నిజాయితీ లతో

కట్టుకున్న అందమైన

పొదరిల్లు మా స్నేహం

ప్రేమానుబంధాలు

ఆప్యాయతానురాగాలు

కోటగోడలుగా పటిష్టంగా

కట్టుకున్న పచ్చని స్నేహం

రాగద్వేషాలు తెలీని

అసూయ స్వార్థమెరుగని

కల్మషమంటని స్వచ్ఛమైన

పాలనురగ మా స్నేహం

కానీ.. ఉన్నట్టుండి

నువు చేసిన ద్రోహం

మనసు ఆనకట్ట ను తెంచి

కన్నీరు ఉరకలెత్తించింది

మోసం అయీనా

భరిస్తానేమో కానీ

నమ్మిన వాళ్ళు చేసే

నమ్మక ద్రోహం భరింపజాలను

ఉదయానికి సూరీడు

తీరానికి అల

నా స్నేహానికి నీవు

అంతలా నమ్మాను

కోటగోడలు పేకమేడల్లా

కూలి పునాదులు కదిలాయి

కానీ నమ్మకం కూలినా

నా స్నేహం చెక్కు చెదరనిది


Rate this content
Log in

Similar telugu poem from Abstract