STORYMIRROR

Midhun babu

Abstract Classics Others

4  

Midhun babu

Abstract Classics Others

బతుకమ్మ

బతుకమ్మ

1 min
297

బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మ

బంగారు వన్నెల బంతికొమ్మ

తంగేడుపువ్వుల తాంబాళమా

గునుగు చేమంతి మందారమా


పసుపు కుంకుమ గౌరమ్మా

ముద్దను మధ్యలో పేర్చిరమ్మా

ముత్యాలముగ్గుల మణిహారమా

తీరొక్క రంగుల సింగారమా


మొదటిరోజున మాయమ్మా

ఎంగిలిపూల బతుకమ్మ

ఆఖరురోజున ఓయమ్మా

సద్దుల బతుకమ్మ వైభోగమా


తొమ్మిదిరోజుల సంబురమా

తృప్తిగ నిన్ను కొలిచేమమ్మా

అటుకులు, బెల్లం, అట్లమ్మా 

చుత్రాన్నం మల్లిదలందుకోమ్మా


అందాలపడుచుల ఆనందమా

అపరంజి బొమ్మల కోలాటమా

ఆటల పాటల తిరగాటమా

అందరిని చల్లగా దీవించుమా

*అందరిని చల్లగా దీవించిమా*


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract