దుర్గమ్మా🙏🙏🙏
దుర్గమ్మా🙏🙏🙏
నీ పధ ఘట్టనలా....... మృదు మంజీర ధ్వనులా !!
వినవచ్చే జననీ......... కారుణ్య పావనీ !!
దయనొసంగి వచ్చితివా...... మా వినతిని వింటివా !!
ఎర్రని మందారమా........ నీ పద ద్వయమా !!
వెండి కొండ దిగి వచ్చిన....... వెన్నెల కిరణమా !!
పూజలందుకోవమ్మా........ పున్నమి పూరెమ్మా !!
అయ్యవారి మనసులో......... మురిపాల కొమ్మా !!
భక్తులందరికీ నీవు......... కల్ప తరువమ్మా !!
జగమునంతటికీ నీవు........ ఆధార శక్తివమ్మా !!
వరములీయగా ఇలకి......... వొచ్చితి ఓయమ్మా !!
హారతులిచ్చేము........ నిను మనసారా కొలిచేము
అమ్మా ! దుర్గమ్మా !!
