మన ప్రేమ
మన ప్రేమ
ఓ మాధవ నీతో పయనం
నీటి మీద రాతలు కాదు ,
నీటి పువ్వులు ...
నేను ముద్ద మందారం
నువ్వు తామర మకరందం
అంతేనా హా ,...
చెప్పవే చిరుగాలి
ఇటుగా వచ్చి పొమ్మని ...
అలజడి లేకుండా
గమ్మున కూకుంటే ,
నా వెనుక ఎవ్వరో నవ్వినట్టు ఉంటాది ..
తీరా తెర తీసి చూస్తే,
నిట్టూర్పు తప్ప నువ్వు ,నీ నవ్వు లేవు ...
అలసిన మనసు శరీరం
సిద్ధం కావాలి అంటే
నీ నవ్వులు పువ్వులుగా
విరబూయాలిగా ......
క్రియలో కౌగిలి తన్మయత్వం
పరవశం పొందాలి అంటే
నీ మాటలు మధురిమలు
తలుపు తట్టాలిగా .
ఓ మాధవ నీతో పయనం
నీటి మీద రాతలు కాదు ,
నీటి పువ్వులు.....
రచన
KANAKA DURGA ✍️
