STORYMIRROR

Midhun babu

Abstract Romance

4  

Midhun babu

Abstract Romance

రాధాకృష్ణుల ప్రేమ

రాధాకృష్ణుల ప్రేమ

1 min
328


కలకానిది సత్యమైనది

రాధాకృష్ణుల ప్రేమేకదా,

యుగాలు మారిన మరచిపోలేనిది రాధకృష్ణుల ప్రేమేకదా,

వేణుగాన పరవశరాగం

రాధాకృష్ణుల ప్రేమేకదా,

అలసిపోని తలపుల వలపుకథ రాధాకృష్ణుల ప్రేమేకదా,

ఆశలమనసు

జన్మల వెలతిపూడ్చినది

రాధాకృష్ణుల ప్రేమేకదా,

తనువు ఆణువణువూ ఏలేటి

హృదయరాగమంజరి

రాధాకృష్ణుల ప్రేమేకదా,

ఒకరి ఊసే మరొకరికి

శ్వాసగా మారినది

రాధాకృష్ణుల ప్రేమేకదా,

ఎదలోపల దాగిన

ప్రణయ సుధా

పరిమళ చెలిమి వెలుగు రాధాకృష్ణుల ప్రేమేకదా,

అనుబంధాల ఊయలతో

నిత్యకాంతిలోకంలో విహరించే

అపూర్వం రాధాకృష్ణుల ప్రేమేకదా,

ప్రేమాభక్తిని కొలవలేని

గగనమంతటి సోయగం

రాధాకృష్ణుల ప్రేమేకదా,

జగతినేలు ప్రేమసాన్నిధ్యపు

సత్య జీవనకావ్యం

రాధాకృష్ణుల ప్రేమేకదా.

నిత్యప్రేమ వాహికకు చేద్దాం

అభివందనం, పాదాభివందనం


साहित्याला गुण द्या
लॉग इन

Similar telugu poem from Abstract