అంతర్థానం
అంతర్థానం
విశ్వంలో అవని నలుసంత,
సూర్య కుటుంబంలో భూమి
తిరుగుతున్న అద్భుత గ్రహం!
పుడమిలో పుట్టెడు వింతలు!
పదార్థం మూలమై విన్యాసాలు!
పర్యావరణం దానికి ఉత్ప్రేరకం!
ప్రకృతి సాధనకు అదే జీవాధారం!
కోటానుకోట్ల జీవజాతులు సహజీవనం!
విశ్వంలో పృద్వి మహోన్నత రూపం!
పర్యావరణ సమతుల్యతే పుడమికి రక్ష!
సకల జీవరాసులలో జ్ఞానవంతుడు మనిషి!
ప్రకృతి ధర్మాలు ఎరిగి,ప్రకృతిని జయించాలనే
భస్మాసుర పేరాశ!
అవసరం కొరకు కాక, ఆదిపత్యంకై దురాశ!
ప్రకృతిని పర్యావరణాన్ని భస్మీపటనం చేష్ట!
కర్బన ఉధ్గారాలు, ప్రకృతి వినాశనం ఫలితం!
పంట పొలాలు మారేను బీడు భూములు!
కొత్త కొత్త వైరస్లతో ప్రకృతి చేసేను విలయతాండవం!
తన గోతిని తానే తోవ్వుకున్న చందంగా జరిగేను శాస్తి!
ప్రకృతిలో మనిషి భాగమే అని గుర్తేరిగి నడవాలి తప్పదు!
సకల జీవులతో పర్యావరణహితంగా బతకాలి!
అలా కాని పక్షాన మనిషే కాదు, ప్రకృతే అంతర్ధానం!
