STORYMIRROR

Midhun babu

Abstract Classics

4  

Midhun babu

Abstract Classics

రాధ మాధవుడా

రాధ మాధవుడా

1 min
245

గజల్ 3979.


రాధంటే ధారామణి..హారమదే గమనిస్తే..! 

అణువణువూ కృష్ణతత్వ..గగనమదే గమనిస్తే..! 


తనువుమనసు వేరుగాక..సమర్పితము తానన్నది.. 

పరవశించు భక్తిగంధ..పవనమదే గమనిస్తే..! 


ప్రకృతిప్రియ రమణీయ..రమణీమణి ప్రవాళమే.. 

అమాయికతా ఫాలధార..తద్భవమే గమనిస్తే..! 


నిజసుందర ఆరాధా..మధురాపురి సంచారిణి.. 

పరిమళించు బృందావన..ధ్యానమదే గమనిస్తే..! 


పదపదమున నర్తిస్తూ..చిందాడే వైరాగ్యమే.. 

ప్రతిపదార్థ భావమూల..మౌనమదే గమనిస్తే..! 


శుభతులసీ యమునాతటి..మాధవాత్మ యోగమదే.. 

కల్యాణీ హంసధ్వని..వైభోగమదే గమనిస్తే..! 



Rate this content
Log in

Similar telugu poem from Abstract