STORYMIRROR

Midhun babu

Abstract Classics Others

4  

Midhun babu

Abstract Classics Others

ఓం సాయిరాం

ఓం సాయిరాం

1 min
297

అంకితం సాయికే అంకితం,

తనువు తలపు శ్వాస ధ్యాస

సర్వం సాయికే అంకితం.


లోకాలు ఎన్నున్నా సాయేగా మాలోకం,

తీపిమాటలెనున్నా సాయి పదమేగా మాకు మధురం,

కలతలెన్ని వేధించిన

సాయి పథమేగా మాధైర్యం,

ఆశలదీపాలెనున్నా మము

సాయేగా మము నడిపించే ఆశయదీపం.

అంకితం సాయికే అంకితం

మా తనువు తలపు సాయికే అంకితం.


సాయి నిలిచిన పలుకుల లోగిలేగా స్వర్గం,

సాయి ఊసేకదా భ్రమలను తొలగించు దివ్యమంత్రం,

కనుపాపల అలజడులను

మాన్పేదేగా సాయి నిత్యసంకీర్తనం,

వెదురును వేణువుగా మార్చు సాయి సన్నిధానానికి

కావాలి జీవితం అంకితం.

అంకితం సాయికే అంకితం

తనువు తలపు సాయికే అంకితం


Rate this content
Log in

Similar telugu poem from Abstract