మౌనగానం
మౌనగానం
మౌనమే మధువుగా..కురిసింది నీవందు..!
నా మదిని గజలుగా..మలచింది నీవందు..!
అక్షరం సాక్షిగా..కోకిలగ మిగిలాను..
నాలోన పాటగా..పొంగింది నీవందు..!
నాగుండె నాదాల..ప్రాణమే నీనవ్వు..
నా వలపు వీణియను..మీటింది నీవందు..!
గోరింట కేమెరుక..అరుణిమలు పంచడం..
నునుసిగ్గు చెక్కిళ్ళ..చిమ్మింది నీవందు..!
ప్రేమతో కాకుండ..యుద్ధాలు ఎక్కడట..
వేధించు అలజడిని..తరిమింది నీవందు..!
ఒక ముళ్ళ గులాబీ..వనముతో పనిఏమి..
చూపుతో నా జగతి..నింపింది నీవందు..!
నిజప్రణయ భావనా..చతురాస్య మాధవా..
హాసాల వెన్నెల్లు..చిందింది నీవందు..!

