STORYMIRROR

Midhun babu

Abstract Classics Others

4  

Midhun babu

Abstract Classics Others

నాదేశం

నాదేశం

1 min
4

నేనేమి మాట్లాడగలను మిత్రమా

నా దేశ విజయాలపై విషం చిమ్ముతుంటే

గగనములో జాబిలి నా దేశం చెంత నిలిస్తే

సంస్కారహీనులు వక్రబుద్ధి చూపుతుంటారు...


నా దేశం విశ్వ విజేతగా ఆవిర్భవిస్తుంటే

విదేశీ బుద్ధుల మేధావులు విమర్శిస్తుంటారు

ప్రతి విజయాన్ని అపహాస్యం చేస్తూ

చరిత్ర హీనులుగా మిగిలిపోతున్నారు...


దేశమంతా గర్వంగా సంబరం చేస్తుంటే

అక్కడక్కడ కుక్కలు మొరుగుతూనే ఉన్నాయి

ఈ దేశపు మట్టిలో జన్మించి కూడా

పరదేశీయుల భావజాలం వెల్లబుస్తారు..


జాతి సగర్వంగా విశ్వవీధిలో పతాకం ఎగరవేస్తే

ఈ దేశములోని కుహనా సంస్కారులు ఏడుస్తూ

మనసు భారమై నిందిస్తూ ఉంటారు

భారత్ విజయం వాళ్లకు బహుశా గిట్టదేమో...


నాయకుడు ఎవరైనా ఇది జాతి విజయం

దేశము సాధించిన అపురూప చారిత్రక నేపథ్యం

అవమానించడం మాని విజయం ఆస్వాదించండి

భారత శాస్త్రవేత్తలను అభినందించండి..


ప్రపంచంలోనే ఘనమైన చరిత్ర మనది

చావు పుట్టుక లేనిది ఈ భారతజాతి మూలం

సకల శాస్త్ర జ్ఞాన నిధులకు నిలయం ఈ భూమి

విశ్వ రహస్యాలన్నీ ఈ నేలపైనే శోధించబడ్డాయి...



Rate this content
Log in

Similar telugu poem from Abstract