STORYMIRROR

Dinakar Reddy

Abstract Fantasy

4  

Dinakar Reddy

Abstract Fantasy

మృగంలా..

మృగంలా..

1 min
388

పరిస్థితుల ప్రభావం అనేస్తే

రాత అని వదిలేస్తే 

బాధ్యత తీరిపోతుందా


మృగంలా మారాడని

పోలిస్తే సరిపోతుందా

దేశమంటే మనుషులే సరే

మరి వారి ప్రవర్తన సంగతేంటి

రోజుకో కొత్త జాడ్యం

సమాజపు అస్థిత్వాన్ని ప్రశ్నిస్తోంది

చెవులు మూసుకుంటావా 


చంద్రుణ్ణి తాకినా

ఆకాశాన్ని ఏలినా

మనిషిలో కలగాల్సిన మార్పు ఎక్కడ


ఏ శీతల పవనమో

పావనభరిత కీర్తన చరణమో

యుగ ధర్మంలో చలనాన్ని తీసుకువస్తుందో 

ఎవ్వరికెరుక 


ఓ మృగంలా

చీకటి రాత్రుల కోసం వేటాడి

అలసిపోయిన స్థితిలో

ఇంకెంత దూరం పారిపోవాలి 


నిన్ను నువ్వు గుర్తు పట్టని స్థితిలో

కొత్త పాటను ఎలా నేర్చావు

మనసులోని దిగులును 

మాటల్లో చెప్పలేక

కవిత్వంలో నీకు నువ్వే చితి పేర్చావు 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract