నీ నేస్తాన్ని
నీ నేస్తాన్ని


ఎంత ఆర్తిగా రాద్దామనుకున్నా
ఆర్ద్రత తో తడిసిన గుండె
ఆవేదననే అక్షరాలుగా రాల్చుతోంది
చిరస్థాయిగా నిలుస్తుందనుకున్న మన స్నేహం
చిగురిస్తున్న కొత్త స్నేహాలతో
చిరునామా లేకుండా పోతుంటే
మిత్ర ద్రోహం చేస్తూ రోజు రోజుకూ
అపరిచితునిగా మారుతున్న నీ ప్రవర్తనను
జీర్ణించుకోలేని మనస్సు
గడిచిన చెలిమికి చిహ్నంగా
చెమరించిన కళ్ళు
గాయపడిన గుండె
గడియ వేయలేని
గతించిన జ్ఞాపకాలను
గడియ గడియకు ఆర్తిగా
గణించు కుంటుంది
విడిపోని బంధంగా ఉండాలనుకున్న స్నేహం
మిత్ర ద్రోహం వల్ల ముడి పడకుండానే విడివడి
వీడ్కోలుతో సుదూర తీరాలకు వెళ్లి
విడదీయరాని స్నేహబంధంగా మార్చాలనుకుని
దూరమవుతున్న నన్ను క్షమించు నేస్తం
నీ సుఖమే నే కోరుతున్న అని నేనకపోయినా
అనుక్షణం నీ శ్రేయస్సు కాంక్షించే
నీ నేస్తాన్ని !!!
************