నేటి తరము
నేటి తరము
వారసత్వంబిపుడు భావి తరముకు లేదు
కారణంబులు వెదికి కలత నొందగ రాదు
కట్టుబాట్లను వదిలి కాలంబులో జనము
చెట్టు పుట్టను బట్టి చెడిపోవుటది నిజము
చదువు సంధ్యలు లేవు సంప్రదాయము లేదు
సదమల హృదయులిపుడు జాతిని పుట్టలేదు
తల్లితండ్రుల దిట్టు దయలేని బిడ్డలిట
కల్లబొల్లి మాటల కఠినాత్ము లౌదురట
ధన గర్వంబు తోడ కనలు చుండెడి వారు
మనసు లేని తరంబు మహిలోన తిరిగెదరు
దేశభాషలు వదిలి ద్రిమ్మరులు జీవించి
నాశనంబు దెచ్చెడి నవతరంబు చరించి
ఘనమైన సంస్కృతిని కాల్చి వేశారులే
మన వారసత్వమును మాయ చేశారులే
మమతాను రాగాలు మరచి పోయారులే
సమైక్యతను నేడు చంపివేశారులే //
