నేటి చిత్రాలు
నేటి చిత్రాలు
చిత్రవిచిత్రమైన లోకంలో
చిత్రాల విచిత్రాలు ఎన్నెన్నో
చెడిపోయిన సమాజంలో
పడిపోయిన విలువలెన్నో !!
అధిపత్యానికి పోరాటం డబ్బులపై ఆరాటం
సభ్యతనే మభ్యపెట్టే సినిమాల కోలాటం
గుట్టునున్న విషయాలు పట్టా పగలు బాహాటం
తెగించిన మనుషులకు ఎక్కడుంది మొహమాటం !!
ఎటు చూడు అస్లీలం
మంచికుండా నేడు శీలం
నేటి యువతకోచ్చింది వాలం
ఈ పైత్యం హాలాహలం !!
ఆ పేర్లు ఆ తీర్లు
ఆయా పాటలు ఆ మాటలు
ఆ కొత్తదనం ఆ చెత్తదనం
ఆ కధలు ఆ చిత్రవధలు !!
ఒక నీతా ఒక నియమమా
ఒక పద్ధతా ఒక పాడా
ఒక మంచా ఒక మర్యాదా
ఒక సంకేతమా ఒక సందేశమా !!
సామాన్యుడే కామాంధుడై
రక్షకులే భక్షకులై
మానవులే దానవులై
మసలుతున్న మాయలోకం !!
ఆడా మగా తేడాలేదు
తీరు తెన్నూ లేనే లేదు
పెద్దవారికి చిన్నతనం పోలేదు
చిన్నవారికి పెద్దతనం పోబోదు !!
కప్పుకుని ఆడతనం
విప్పుకుని తిరుగుతోంది
సంస్కారం కరుగుతుంది
మానవతా మరుగుతోంది !!
ఎవరెలా ఉండాలో
వివరించాల్సిన పరిస్థితి
ఎవరికీ వారే పెద్దలు
చివరికి ఇది పరిస్థితి !!