నైసర్గిక నైకట్యం
నైసర్గిక నైకట్యం


మనోహరి ప్రకృతి సామీప్యాన్నిప్రేక్షించండి,
లేత లలిత హరిత తరులతలని వీక్షించండి,
విహంగముల కాకలి కలరవాన్ని ఆలకించండి,
ఓ అవర్ణనీయ అభినవ అనుభవాన్ని పొందండి |౧|
జలదరించే ఘనాఘన ధారాపాతం ధ్వనిని శ్రవించండి,
ఝరఝరంగా మ్రోగించే నిర్ఝర నినాదాన్ని ఆలకించండి,
కృష్ణమ్మ గోదావారి మహానదుల కళకళ నాదాన్ని వినండి,
లోతైన సాగర లహరుల కలకల కోలాహలాన్ని శ్రవించండి |౨|
అపారమైన నీలంనభ సీమ తిలకించండి,
సూర్యోదయం సువర్ణ ప్రభని తిలకించండి,
పూర్ణచంద్రుని శీతల ఆభని తిలకించండి,
అగణిత తారక నక్షత్రరాసులును చూడండి |3|
ప్రఫుల్లిత రంగురంగుల కుసుమాలను వీక్షించండి,
ముకుళిత సుమముల సుగంధాన్ని ఆనందించండి,
పువ్వుల మీద పరిభ్రమించే భ్రమరాల్ని వీక్షించండి,
ఉద్యానంలో విహరించే ఆకుచిలుకలని వీక్షించండి |౪|
కోయిల కుహూ కుహూ గానాన్ని ఆలకించండి,
మైనా రామచిలుకల అనునాదాన్నిశ్రవించండి,
మనోజ్ఞ మయూరి లలిత లాస్యాన్నివీక్షించండి,
మానసరోవరంలో హంసల సంతరణం చూడండి |౫|
గగనంలో గోధూళివేళ నిష్ప్రభ వెలుగుని కళ్లారా వీక్షించండి,
వృష్టిపాతనంతరం సప్తవర్ణాల ఇంద్రధనుస్సుని వీక్షించండి,
శైల శిఖరం పైన ప్రతిధ్వనిత లయం గుంజనాన్నిశ్రవించండి,
నైసర్గిక నైకట్యంలో అభిజ్ఞత అభినవ అనుభూతిని పొందండి |౬|