నాన్న ప్రేమ
నాన్న ప్రేమ
గుప్పెడంత గుండె గూటిలో
ఆశల సౌధం నిర్మించే
కంటికి రెప్పగ రేయింబవళ్ళు
బిడ్డలను కాచేలే!
పిల్లల కోర్కెలు తీర్చే
అద్భుతదీపం నీవేలే!
అల్లావుద్దీన్ దీపము నీవేలే!
పిల్లల కష్టంలో
రక్షణ కవచము నీవేలే!
ఆనందంలో తొలి చిరునవ్వు
నీవేలే నాన్న!
కౌమార్యంలో యవ్వనదశలో
స్నేహితుడివి నువ్వే
నాన్న! ఆదర్శం నువ్వే
కష్టాలు నష్టాలు భయాలు
బాధలు నా దరిచేరవులే!
నాన్న నువ్వు మా దగ్గర ఉంటే!
నువ్వు నవ్వుతూ వెలుగుతూ
వెలిగించే దీపాలు మేమేలే!
అహర్నిశలు శ్రమించే
మహోన్నత వ్యక్తివిలే!
నాన్న! వందల వందనములు.
