STORYMIRROR

ARJUNAIAH NARRA

Abstract

4  

ARJUNAIAH NARRA

Abstract

నా స్వామి

నా స్వామి

1 min
393


            PART I

నిజం! నీతో కాలముకు సమయము తెలియదు

ఉదయాన్నే ప్రభాత సూర్యూడిలా దర్శనమిస్తావు

ఊహల ఉషస్సులో భవిష్యత్తు బాటలు పరుస్తావు

మధ్యాన్నం కాలే కడుపుకి అన్నం ముద్దల కనపడుతావు

పగలు అయిపోయినదని పగలుకు అసలు తెలియనియ్యవు 

నీతో వేసే అడుగులతో సాయంత్రాలు అవిరులవుతాయి

కలువలను రేరాజువలె రాత్రిళ్ళన్నీ రంజింప చేస్తావు 

నిజం! నీతో కాలముకు సమయము తెలియదు

          PART  II


ముసురుకొస్తున్న శత్రువుని, పరుగులు పెట్టించావు

ముక్కలైన కుటుంబానికి, ఊపిరి అందించావు

అన్నదమ్ముల అనుబంధాలను అక్కున చేర్చావు

చివరి మజిలికి చేరువలో ఉన్న, 

నా తల్లికి ఆయుస్సును పెంచావు


చెదిరిన నా నవ్వులను, నా దోసిట్లో పొశావు

నలిగిన నా ఆశయాలకు, జీవం ఇచ్చావు

నడకను నేర్చిన నా పిల్లలకు, 

నాన్నగా నన్ను దగ్గరకు చేర్చావు

మహా శివరాత్రి రోజున నన్ను

అర్ధనారీశ్వరుడిగా మార్చావు


నా స్వామి "దొర స్వామి"కి అంకితమిస్తూ....



Rate this content
Log in

Similar telugu poem from Abstract