నా పేరు గోవా
నా పేరు గోవా
నా పేరు గోవా
నా అవతరణ1987 మే 30న
భారతదేశంలో 25వ రాష్ట్రం అయ్యాను
నా రాజధాని ఫనాజీ
నా అధికార భాష కొంకణి
నేను దేశంలో వైశాల్యపరంగా రెండవ
అతిచిన్న రాష్ట్రన్నీ
నేను జనాభా పరంగా నాలుగవ
అతిచిన్న రాష్ట్రన్నీ
నేను అరేబియా సముద్రం అంచున ఉంటాను
దీని కొంకణ తీరమని కూడా అంటారు
నాకు 101 కి.మీ. సముద్ర తీరము
అందమైన బీచ్ ఉంది
నా ఆట మైదానాల్లోనూ, పొలాల్లోనూ వర్షాలు లేనపుడు ఫుట్‌బాల్ ఆట
నాకు చపోరా నదిపై చేపలు పట్టడం ఇష్టం మరియు
ఓడలపై రవాణా ఒక ముఖ్యమైన జీవనోపాది.
నా ప్రధానమైన వ్యవసాయోత్పత్తులు వరి, జీడిమామిడి, పోక, కొబ్బరి
నా పరిశ్రమలు పురుగు మందులు, ఎరువులు, టైరులు, ట్యూబులు, చెప్పులు, రసాయనములు, మందులు.
నాకు రెండు రైల్వే లైనులున్నాయి - ఒకటి స్వాతంత్ర్యానికి పూర్వం నిర్మించిన వాస్కో డ గామా - హుబ్లీ మార్గం. మరొకటి 1990 దశకంలో నిర్మించిన కొంకణ్ రైల్వే మార్గం.కొన్ని చోట్ల నదులు దాటడానికి ఫెర్రీలు వాడతారు.
నా పండుగలు గణేష్ చతుర్ధి, క్రిస్టమస్, ఆంగ్ల సంవత్సరాది, షిగ్మో పండుగ, కార్నివాల్ (కార్నివాల్ అంటే తిరనాళ్లు) - ఇవి గపెద్ద ఎత్తున జరుపుకొనే ఉత్సవాలు.
సాంప్రదాయిక కొంకణి జానపద గీతాలు, సాంప్రదాయిక "మందో" సంగీతం, పాశ్చాత్య సంగీతం, ట్రాన్స్ సంగీతం (గోవా ట్రాన్స్ సంగీతం)
నా పర్యాటక రంగం నా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక.
భారతదేశానికి వచ్చే మొత్తం విదేశీయాత్రికులలో 12% మంది గోవాను సందర్శిస్తున్నారు.
నా దగ్గర మంచి ఖనిజ సంపద ఉంది. ముడి ఇనుము, బాక్సైటు, మాంగనీసు, సిలికా వంటి ఖనుజాలు బాగా లభిస్తున్నాయి.
నా అగూడా కోట(Fort Aguada),ఫోర్చుగీసువారు తమ రక్షణ కోసం నిర్మించిన స్థావరాలలో ఒకటి.
నా నదులు మాండవి, జువారి, తెరెఖోల్, ఛపోరా, బేతుల్
నా మార్ముగోవా నౌకాశ్రయం మంచి సహజ నౌకాశ్రయం
నాకు రెండు ప్రపంచ వారసత్వ స్థలాలు
బామ్ జీసస్ బసిలికా (Bom Jesus Basilica). ఇక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ దేహమును భద్ర పరచారు. ప్రతి పదేళ్ళకూ ఒకసారి ఈ శరీరాన్ని పూజకై వెలికి తీసి ప్రజలు చూసేందుకు అనుమతిస్తారు.
రెండవది పాంజిమ్‌లోని ఫౌంటెన్‌హాస్ (Fontainhas)
నా జాతీయ ఉద్యానవనాలు
సలీమ్ ఆలీ పక్షి ఉద్యానవనం
బోండ్లా వన్యప్రాణి రక్షితవనం
మోలెమ్ వన్యప్రాణి రక్షితవనం
కోటియాగో వన్యప్రాణి రక్షితవనం
మహావీర్ వన్యప్రాణి రక్షితవనం.
గమనిక: ముఖచిత్రం నందు గల భారతదేశ పటంలో 6 వ నెంబర్ చూపించే ప్రాంతం ఈ రాష్ట్రం. అట్టి ఇండియన్ మ్యాప్ Google వారి సౌజన్యంతో public domain నుండి స్వీకరించడం జరిగినది
