నా పేరు బీహార్
నా పేరు బీహార్
నా పేరు బీహార్
నా అవతరణ 1912 మార్చి 22లో
నా రాజధాని పాట్నా (ఆనాటి పాటలీపుత్రనగరం
ప్రముఖ రాజకీయ, సాంస్కృతిక, విద్యా కేంద్రంగా వెలిగింది. నలందా, విక్రమశీల విశ్వవిద్యాలయాలు ప్రపంచప్రఖ్యాతి గాంచినవి)
నా అధికార బాషలుహిందీ, ఉర్దూ, అంగిక,
భోజ్‌పురి, మగహి, మైథిలి
నేను రెండు మతాలకు జన్మనిచ్చాను
బౌద్ధ, జైన మతాలకు జన్మస్థలం.
బోధ్‌గయలో గౌతమబుద్ధుడు జ్ఙానోదయం పొంది, ధర్మ బోధన ఆరంభించాడు.
జైనమత ప్రవక్త మహావీరుడు వైశాలిలో జన్మించాడు.
నా నదులు గంగ, శోణ, బాగమతి, కోసి, బుధి గండక్, ఫల్గు వంటి ఎన్నో ప్రవహిస్తుంన్నాయి
నా పర్యాటక ప్రదేశాలు
బౌద్ధ క్షేత్రాలు - బోధ్ గయ, నలంద, రాజగిరి.
జైన క్షేత్రాలు- వైశాలి, పవపురి.
సిక్ఖు క్షేత్రాలు- హర్‌మందిర్ సాహిబ్, పాట్నా (గురు గోబింద్ సింగ్ జన్మస్థానం).
హిందూ క్షేత్రాలు - గయ (పిండదాన స్థలం), బైద్యనాథ ధామం, మహిసి తారామందిర్.
ముస్లిం క్షేత్రాలు - బిహార్-ఎ-షరీఫ్
చారిత్రిక స్థలాలు - చంపారణ్, ససరాం మొదలైనవి
