నా మనసే
నా మనసే
ఎగిరే గాలిపటం లా
విరిసిన కుసుమం లా
పరవసాన పరవశించే
ఓ మనసా
చిరు బాల్యం
నా జ్ఞాపకం
నాలుగు స్తంభాల
నడుమ ఆడే ఆ ఆటలు
నేలా బండలు
ఏడుపేంకులాటలు
ఆహా ఎవరితో
చెప్పేది ఆనాటి
మధురానుభూతులు
అలసి సొలసిన
ఈ మనసు
ఇప్పుడు కాంక్షిస్తుంది
ఆ చిన్నారి మనసులను,
మనుషులను
ఎక్కడని వెతికేది
ఆ స్నేహలను
ఆ సమయాన్ని
ఓ మనసా
ఆవేశము ఆనందము
రెండు త్రాసులలో
జీవితం
అలసిన, సొలసిన ఓ మనసా
ఊరటిల్లవే ఓ మనసా
ఎంతటి వారలైన
ఈ ఎడబాటు తప్పదే
ఆడపిల్ల ఆడపిల్లే కానీ ఈడ పిల్ల కాదు కదా
అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లతో
ఆటలాడే ఆ వయసు
ఇక తిరిగిరాదే ఓ మనసా
