మువ్వల మురళి
మువ్వల మురళి
ముద్దు ముద్దుల మువ్వల మురళి !
ముద్దే ముద్దని ఓ పెదాన్ని తాకింది మురళి !
ముద్దు మీద ముద్దుకు ఉక్కిరి బిక్కిరి అయింది మురళి !
వీడని శ్వాసతో సయ్యాట లాడింది మురళి !
రాజీ పడిన రంగుల మురళి !
రాగం మార్చిన ముద్దుల మురళి !
గానమై గాలిలో లీనమై రక్తి స్వరమైన రవళి !
నాధమై వేణు నాధమై
వినోదమైంది మైమరచిన మురళి !
బాణమై మన్మధ బాణమై గుచ్చింది ఒక హృదయాన్ని మురళి !
రాధా శ్యాములకు రాయభారం అయింది మురళి !
తాకిన పెదం గోపాలకృష్ణుడదని ,
గోవర్ధనుడదని ,
మురిసి మురిసి పోయింది మురళి !
ముద్దులన్నీ మువ్వల గోపాలుడవని , నంద గోపాలుడవని పరవశించి పోయింది మురళి !
ఆట సయ్యాట నాతోనా అని ! కృష్ణ పరమాత్ముడితోనా అని ! ఉరకలేసి ఊగులాడింది మురళి !
గానమై నాధమై తాకింది పవిత్రమైన రాధా హృదయానాన్న ఆ రవళి అని ఊరంతా గొప్పలు చెప్పుకుంది మురళి !
