మూసుకుంటోంది ముఖాన్ని ప్రపంచం
మూసుకుంటోంది ముఖాన్ని ప్రపంచం


ఈ విశాలప్రపంచం ...
కుంచించుకు పోతోంది కొంచెంకొంచెం
మూసుకుంటోంది
ముఖాన్నిభయంతో
కానీ....
దాచుకుంటోంది
ఆశల్ని స్వార్థంతో
** ** **
చైనా దాస్తున్న కోవిడ్రహస్యాలు!
అమెరికా చేస్తున్న వీసా శాసనాలు!
విశ్వవిదేశవాణిజ్యవ్యూహాలు!
రాష్ట్రాల్లోకుటిలబుద్ధి వ్యాఖ్యానాలు!
వార్తల్లో ఇవే విచిత్రాంశాలు!!
*** **** *****
రెండోమూడోనాల్గో
చక్రాలున్నబళ్ళల్లోదూసు కొస్తున్నవాళ్ళు
బూట్లోచెప్పులో ఏ జోళ్ళో ఈడ్చుకొస్తున్నవాళ్ళు
నాలుక్కాళ్ళవాకరో
మూడుకాళ్ళ కర్రో
ఒంటికర్రోతోడై కుంటుకుంటొస్తున్నవాళ్ళు...
విధిగా వీధికి
విధులుకల్పించినవారు
ఎక్కడివారక్కడే ఆగిపోయారు
గుదిబండలుకట్టినా
ఆగక తనకలాడి రోడ్డుపైకిపరుగుపెట్టే జీవి
తనకుతానే కట్టుబడి నట్టింట మెలగుతోంది!
చావుకు జడిసి సగటు జీవి
ఆశ వదులుకుంది స్వేచ్ఛాజీవితంపై
నేతలు మేలు చేస్తారనుకుంటూ
దైవదూతలుగా మనసా నమ్ముకుంటూ....
*** *** **
సరిహద్దుల్లో చొఱబాట్లు ఆగట్లేదు
ధీరజవాన్ల వీరమరణాలాగట్లేదు
ప్రపంచనేతల ప్రణాళికలాగట్లేదు
పాలకులకుప్రతిపక్షాలకుపొసగట్లేదు
కరోనాకూ మందు దొరకట్లేదు
రాజకీయ రాయభారాలు కుదరట్లేదు
ఆశ్చర్యమేమంటే.....
మృత్యువుమింగేస్తున్నా
అవినీతికి బ్రతుకుపై ఆశ చావట్లేదు!!
గాదిరాజు మధుసూదన రాజు