STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Tragedy

4  

Dinakar Reddy

Abstract Drama Tragedy

వీణలో లేని రాగం

వీణలో లేని రాగం

1 min
249

చల్లని గాలికి

ఒత్తైన కురులు కదిలె

ఆతని వెన్నెల నవ్వులు 

తలపులలో కదిలె


అమావాస్య రేయి అయినా

పండు వెన్నెలలా మెరిసె

చెక్కిలి నుండి జారి

ఓ కన్నీటి బిందువు

వీణ తీగలను కదిలించె


మదిలోని భారం

వీణలో వినిపించని కొత్త రాగం

ఆమెలో కంపించె


ఆ రేయి

నలు దిక్కులను విషాద తీగలుగా మార్చుకుని

శోక దేవతలా ఆమె పొగిలి పొగిలి ఏడ్చె

విరహం సుఖమే

మరలా సఖుని చూడవచ్చని తెలిసాక


కానీ

రాని ప్రియుని కోసం

వీణా నాదం వినిపిస్తూ 

ఇలా వేచి ఉండడం

యవ్వనాన్ని వేధించడం

ఎవరికి ఇచ్చేను వినోదం..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract