STORYMIRROR

T. s.

Abstract Tragedy Others

4  

T. s.

Abstract Tragedy Others

సంచార చక్రం

సంచార చక్రం

1 min
10

నేను మనసు, మెదడు, శరీరం అనే లోకంలో ఆత్మనై సంచార చక్రంలా తిరుగుతూ ఉంటాను.


నరకమనే జనవాసంలో బంధాలనే చురకత్తుల బోనులో నివసిస్తూ ఉంటాను.


నేను స్వేచ్ఛ లేని జీవనంలో విరిగిన రెక్కలతో ఊహలలో వీర విహారం చేస్తూ ఉంటాను.


ఆశాపాశాల మధ్య అలుపెరుగక వ్యామోహల నడుమ గెలుపు,ఓటములను ఆహ్వానిస్తూ ఆస్వాదిస్తూ ఉంటాను.


మదిలో, మనసులో స్తైర్య విహారం చేసే అంతులేని ఆలోచనలను అవలోకనం చేస్తూ ఉంటాను.


నేను మనసు, మెదడు శరీరం అనే లోకంలో ఆత్మనై సంచార చక్రంలా తిరుగుతూ ఉంటాను.


Rate this content
Log in

Similar telugu poem from Abstract