STORYMIRROR

indhu vangdoth

Tragedy Inspirational Others

4  

indhu vangdoth

Tragedy Inspirational Others

ఎవరు నేసిన పతాకం?

ఎవరు నేసిన పతాకం?

1 min
5

 


పడగెత్తిన దొర పాలనను పతనం చేసేందుకు.. 

ఉడుకెత్తిన నెత్తురు ఉప్పెన సృష్టించగా.. 

ఉరికొయ్యల మీద దూరంగా వేలాడిన 

అమరవీరుల త్యాగ ఫలితమే 

రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకమా? 


పరాయి పాలన అంతమునర్చి 

విముక్తి పొందావా పంజరం నుంచి

 అంబరమునకు అందము తెచ్చి 

పింగళిచే రూపుదిద్దుకున్న సువర్ణ పతాకమా? 


భూమాత ఒడిలో కడలివోలే 

ఎగిసిన రక్తంతో నేసిన పతాకమా? 


భార్య, భర్త కోసం.. 

తల్లి, కొడుకు కోసం.. 

పిల్లలు, తల్లిదండ్రుల కోసం దార పోసిన కన్నీరుతో నేసిన పతాకమా? 


కులమత వర్ణాలు అంటకుండా.. 

దేశ ప్రజలను ఒకటి చేసి ఎగురవే స్వేచ్ఛ పతాకమై..! 


మనుషుల మధ్య ఎగిసే కోపద్వేషాలు నడుమ ఐకమత్యం గుర్తుచేస్తూ వెలగవే త్రివర్ణ కేతనమై..! 


ఎవరు నేసితేమి! 

నేటి నాయకులకు స్వలాభాన్ని వదులుకోమని చెప్పమ్మా పతాకంలో కాషాయమా! 


ఎవరు నేసితేమి! 

సత్యశోధి వై శాంతికి చిహ్నంగా సహనాన్ని అలవర్చుకోమని నేర్పుమా శ్వేత వర్ణమా! 


ఎవరు నేసితేమి! 

భారతావని అభివృద్ధి పథంలో సస్య సమృద్ధి మార్గమని తెలుపుమా పచ్చదనమా! 


ఎవరు నేసితేమి! 

ధర్మాన్ని మాత్రమే కాక జ్ఞానోదయానికి మార్గం సూచించుమా అశోక ధర్మ చక్రమా! 


ఎందరో శౌర్య సాహసాలతో నేసిన పతాకమా! 

ఆకాశాన్ని తాకి కొక్కోటి నోట

 నీ కీర్తి పలుకుతుంటే

 అది విని గర్వంబు పొంది

 మా అక్షరాలతో అభిషేకము చేసే

 కవులము మేము! 

 మీ బిడ్డలము మేము! 

 జేజేలు నీకు! 

 జేజేలు త్రివర్ణ పతాకమా! 

జేజేలు సువర్ణ పతాకమా! 



Rate this content
Log in

Similar telugu poem from Tragedy