STORYMIRROR

Swarnalatha yerraballa

Drama Tragedy Others

4  

Swarnalatha yerraballa

Drama Tragedy Others

ఒంటరి

ఒంటరి

1 min
366

నా కళ్ళలో కన్నీరు సుడులున్నాయి

రాళ్ళను సైతం కరిగించగల కథలున్నాయి

మనసులేని మనిషిచ్చిన కష్టాల కానుకలున్నాయి

ఎవరికి తెలియని కథలెన్నో నా జీవిత కథనం లో దాగి ఉన్నాయి


         "నా కళ్ళలో "


అందరిమల్లె నాకు ఒక మనసుంది

అది మూగరాగమేదో ఆలపిస్తోంది

మూగ మనసుల రాగం ఆలకించు వారెవరోయి

నా దరి చేరి ఓదార్పునిచ్చే మనసేదోయి

నా కన్నీరు సుడులను తుడిచే చేయేదోయి


         "నా కళ్ళలో "


ఏదోషం లేకున్నా లోకం గుసగుసలాడింది

ఉన్నతోడును సైతం విడదీసి ఒంటరిని చేసింది

గుణపాఠం చెప్పి గమ్యం చేరు ధైర్యం నాకు లేదోయి

నా గమ్యం ఎల్లలు నాకే తెలియకున్నవోయి

దారం తెగిన గాలిపటమునకు గమ్యమేది ఉంటుందోయి


        "నా కళ్ళలో"


Rate this content
Log in

Similar telugu poem from Drama