STORYMIRROR

Dinakar Reddy

Drama Tragedy

4  

Dinakar Reddy

Drama Tragedy

వదల్లేని ఎదురుచూపు

వదల్లేని ఎదురుచూపు

1 min
293

వీడ్కోలు పలికేందుకు వచ్చిన చోటు

ఇప్పుడు దినచర్యలో భాగమైంది

ఒక కాలు ముందుకు

మరో కాలు వెనక్కి లాగుతోంది


దింపుడు కళ్ళెం ఆశలతో

జ్ఞాపకాల పేజీలను కూర్చిన పుస్తకాలు

బరువెక్కిన కన్నీళ్లు 

బాధ్యతల కౌగిళ్లు

పంచుకునే మనసు లేక

తల్లడిల్లిన బతుకు ప్రతిగా


ఆమె ఎదురుచూస్తోంది

వదల్లేని ఎదురుచూపు

బాణాలుగా మారి నింగికెగసి

అతని ఆచూకీ కోసం గాలిస్తున్నాయి


వచ్చే వార్త ఎలాంటిదో అని

ఆమె కళ్ళు టపటపా కొట్టుకుంటున్నాయి

ఏమో

మరల అతడి తనువును తాకే రాత

ఈ సఖికి ఉన్నదో లేదో

కాలమెంత సానుకూలమో

స్పందన ఎక్కడ కలిగేనో..



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama