మూలదేవుడు...శ్రీనివాస భారతి
మూలదేవుడు...శ్రీనివాస భారతి


అక్కడంతా కోలాహలం
వచ్చేవాళ్ళు
వెళ్ళేవాళ్ళు
నోట్లు చేతులు మారుతాయి
నిమిష నిమిషానికి
కుబేరుడు
అక్కడే కూర్చొని
లక్ష్మితో
మంతనాలు చేస్తాడు
చెయ్యి చూస్తే
గదిలో పెడ్తే
కత్తి నూరితే
రకానికో రేటు
జలగలు
మనుషుల్లా మారి
ప్రయోగాల పేరుతో
నెత్తురు కల్లజూస్తారు
డబ్బు జబ్బుకు
వైద్యం లేనిదిక్కడే...
------&&&&&&&-----//