STORYMIRROR

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

మత్తులో యువత

మత్తులో యువత

1 min
2

మత్తులో యువత

(ఇష్టపది మాలిక )


మత్తుమందులు వాడి మాన్యతను వీడంగ

సత్తువను కోల్పోయి సంపదలు పోవంగ

జీర్ణమై దేహంబు శీఘ్రముగ నశియింప 

చూర్ణమౌ నీ భావి శోచ్యమై విలపింప 

హీన మతితో ఛాత్రు లివ్విధిని బ్రతుకంగ

కానలేక నిజంబు కబోదులు మెలగంగ

ప్రగతి లేనట్టి మన భవితవ్య మేమగును?

సుగుణ శీలురు లేక శూన్యమౌచు మిగులును 


మేలుకొమ్ము !ఓ యువ మేధావి వర్గమా!

కాలమను జాలమున ఖైదివై పోకుమా!

మంచి యలవాట్లతో మనుజులై నిలుచుండి 

వంచనను విడనాడి పరువుతో బ్రతకండి!

పెడదారి బట్టుచో పేదలై క్రుంగుదురు 

సుడిగుండాల మునిగి సొమ్మసిలి పోవుదురు.


పెద్దవారిని గాంచి ప్రేమతో మురిపించి 

బుద్ధిమంతులై చని భువిలోన పయనించి 

చదువుసంధ్యలు నేర్చి సాధువులుగా మెలగ

పదిలమై దేశమున పసిడి కాంతులెగయగ 

జాతిలో సౌఖ్యంబు శాంతులే కల్గులే!

భాతితో నీ దేశ ప్రగతి వర్థిల్లులే!//


Rate this content
Log in

Similar telugu poem from Inspirational