STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Tragedy

4  

Dinakar Reddy

Abstract Drama Tragedy

మరువలేక మరపురాక

మరువలేక మరపురాక

1 min
304

బంధానికి బలవంతానికి

పంతానికి గొడవకి

అర్థం లేని విషయాలకి

మనసు ఒక తావైంది


తావిలేని పూవులాగా

తపనలేని రచయితను నేను

కాలం కలానికి నిరాదరణ చూపింది

కాగితం ఖాళీగా నిలిచింది


అవే స్మృతులు

మనవే ఆ వింత నవ్వులు

విచిత్ర అనుభవాలు

అవి వ్రాయాలని కొన్ని రోజులు

వ్రాయకూడదని కొన్ని రోజులు


మరువలేక మరపురాక

మరోసారి అడుగుతున్నా

కాలానికి ఎదురీదుతూ 

ఇలా మిణుకు మిణుకుమంటున్న ఆశతో

ఇంకా ఉన్నా

నీ పేరే తలుచుకుంటున్నా


Rate this content
Log in

Similar telugu poem from Abstract