మరణమా..
మరణమా..
నిరుపమానమైన నిన్ను
గుర్తు చేస్తోందా
మృతకణాలు రాలి
కొత్త చర్మం రావాలనా
ఈ క్రీములు
క్రిముల కోసమా
లేక నీ కోసమా
కళ్ళల్లో ఇంకా బాధ
లేత వలపు స్మృతులా
కోల్పోతున్న జ్ఞాపకశక్తి
ఇంకా తనని మర్చిపోలేదనా
చేతి కర్ర పట్టకూడదనా
కళ్ళ జోడులోంచి చూడకూడదనా
మందులు గుర్తు పెట్టుకుని
ఆ వాసన పీల్చకూడదనా
ఎందుకు ఆహ్వానిస్తున్నావ్
నన్ను
ఇప్పుడు నిన్ను ఒడిలోకి తీసుకుని
ఓదార్చాలనా
నీ వాళ్ళతో
తిట్లు తినాలనా
మరణమా అని
అంత ప్రేమగా పిలుస్తున్నావ్
నా రాకను వేడుకుంటున్నావ్..
