STORYMIRROR

ARJUNAIAH NARRA

Abstract Tragedy Others

4  

ARJUNAIAH NARRA

Abstract Tragedy Others

మొబైల్ మనసు

మొబైల్ మనసు

1 min
507

ఇది నిజం కాదా......?????

ఈ ఆధునిక చరవాణి యంత్రం....

లోపలి మనిషికి వేసెను మాయా మంత్రం

మనిషి కనపడడు

మాట సరిగా వినపడదు

మనసు గోడు వినడు 

మనసు విప్పి మాట్లాడడు....


(వీడియో కాల్లో.....మా ఆవిడతో...)


చిత్ర సంభాషణలో విచిత్ర వీక్షకుణ్ని //2// 

తను కనపడదు

తన మాట సరిగా వినపడదు....

నా మాట వినదు 

నా మొఖం చూడదు....

(ఎందుకంటే.....సాంకేతిక కారణాల వల్ల 

నా మొఖం ఔట్ ఆప్ కవరేజ్ ఏరియా....)


తను కూరగాయలను తరుగుతూ

కుక్కలను తరుముతూ

కోతులు వెల్లగొడుతూ లేదా

పిల్లల మూతులు కడుగుతూ

నా కంట కనపడదు నా మాట వినదు

(ఎందుకంటే......ఫోన్ మర్చిపోయి బోర్లా పెట్టింది)


తను వంటింట్లో వంటలు చేస్తూ

లేదా నట్టింట్లో నాట్యం చేస్తూ 

కొలయిలో నీళ్లను పడుతూ

లేదా గేటు దగ్గర కోళ్లను కొడుతూ

నా కంట కనబడదు నా గోడు వినదు

(ఎందుకంటే......యువర్ వీడియో ఐస్ పాజ్డ్)


ఆరుబయట బట్టలు అరేస్తూ

అరుగుకు ఆవల పిల్లలపై అరుస్తూ

విడిచిన బట్టలు ఉతుకుతూ

కొత్తవి కుట్టు మిషన్ మీద కుడుతూ

మా అమ్మని పిలుస్తూ లేదా దేవుణ్ణి కొలుస్తూ

నా కంటే కనపడదు నా గోడు వినదు

(ఎందుకంటే......పూర్ కనెక్షన్ ......రికనెక్టింగ్...)


మా ఆవిడతో........

చిత్ర సంభాషణలో విచిత్ర వీక్షకుణ్ణి...

తను కనబడదు తన మాట వినబడదు

నా ఎద సడి ఎరుగదు నా మనసేరిగి నడవదు


నా కంట కనబడదు నా కంటి కన్నీళ్ళు కనపడవు.......

నా కంట కనబడదు నా కంటి కన్నీళ్ళు కనపడవు.......

********************


నేను రాయడం పూర్తవ్వలేదు....

ఎడ్వడం పూర్తవ్వలేదు.....

సుదూరం నుండి గాలి లీలగా సినీ సంగీతాన్ని మోసుకొచ్చింది.....


వేణువై వచ్చాను భువనానికి....

గాలినై పోతాను గగనానికి......

వేణువై వచ్చాను భువనానికి....

గాలినై పోతాను గగనానికి......!

18.10.2020


Rate this content
Log in

Similar telugu poem from Abstract