STORYMIRROR

# Suryakiran #

Abstract Inspirational

4  

# Suryakiran #

Abstract Inspirational

అనుబంధాలు

అనుబంధాలు

1 min
334

నాతో నేను . నా ఉన్నతికై నేను ;

పుట్టుక ఒక వరం . జీవిస్తా అనుక్షణం .


చదువుతా విశ్వాన్ని విశ్లేషణగా ;

సాధిస్తా ఔన్నత్యాన్ని అందరూ గర్వించేలా !


నాఇల్లు నాకు నందనవనం ;

నవీనతతో రక్షణకై , ప్రశాంతతకై ఆ సౌధం .


నాతో సుఖసౌఖ్యాలతో నా పరివారం ;

అతిధులే ఆభరణాలుగా విలసిల్లే నివాసం .


అమ్మ మమకారం నా జన్మకు శ్రీకారం ;

బాల్యంలో వెచ్చని ఒడి నాకు మొదటి బడి .


నాన్న అభిమానం , రోజుకి ఒక సోపానం ;

మరువలేం ప్రపంచానికి తను చేసే పరిచయం .


వారి మనసు విశాలం , గొప్పది త్యాగం ;

అమూల్య సలహాలతో అనుదినం నూతనం .


వివాహితునిగా శ్రీమతి నాకొక బహుమతి ;

హృదిలో దేవత , మధురమైనది ఆమె మమత .


జీవితంలో తన చెలిమితో ప్రతి అడుగు ;

మా ప్రేమకు చిహ్నాలు బాధ్యతతో మెలుగు .


నిరంతర ఆత్మీయతతో సోదరసోదరీమణులు ;

తమ అండదండలతో స్నేహితులు .


సంస్కృతి , సాంప్రదాయం అంతర్భాగం ;

ప్రకృతి ఆరాధనతో జీవనసౌందర్యం .


నీతి , నిజాయితీతో సమాజసేవకుడిని ;

మనదేశ అభివృద్ధిలో భాగస్వామిని .


సౌభ్రాతృత్వాన్ని సాధించే ప్రపంచ పౌరుడను ;

భద్రతను , సమగ్రతను కాపాడే పర్యాటకుడను .

*********



Rate this content
Log in

Similar telugu poem from Abstract