STORYMIRROR

Dinakar Reddy

Abstract Romance

4  

Dinakar Reddy

Abstract Romance

హేమంతపు వెన్నెల

హేమంతపు వెన్నెల

1 min
351

మంచు పూల దుప్పటిలో

మనసైన వారి కౌగిలి లేదు


మన సంగమానంద తారా స్థాయి

కాలము కళ్ళలో నలకయినట్లుంది


అందుకే నిన్ను నాకు దూరం చేసింది

శ్రావణ సమీరాల్ని వేడెక్కించింది


పరిష్కారం లేని సమస్యలా కాదు

సమస్య అర్థం కాని స్థితికి నా జీవితాన్ని మార్చింది


అదిగో ఇదిగో అంటూ కార్తీకం కూడా వెళ్ళిపోయింది

నువ్వొస్తావని గడప దగ్గర దీపాల్లా కూర్చున్నా కదా

నన్ను వెక్కిరిస్తూ వెళ్ళిపోయింది


ప్రియా!

చూడు ఈ హేమంతపు వెన్నెల

కన్ను గీటి నన్ను మౌనం వీడమంటోంది

నీ కోసం బిగ్గరగా విరహ గీతాలు పాడమంటోంది


నా పైత్యం 

అబ్బే 

అదే అదే ప్రేమ 

ప్రేమ విరహం

ముదరక ముందే వచ్చేస్తావుగా?!..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract