STORYMIRROR

# Suryakiran #

Abstract Inspirational

4  

# Suryakiran #

Abstract Inspirational

గాయం

గాయం

1 min
375

స్పందించే మనసుతో మనకు

 ఎంత ఆనందం !

నొప్పించే గాయాలతోనూ

 దానికి అనుబంధం !!


ఎత్తుకుని ముద్దాడితే 

బాలల్లో చిద్విలాసం ;

ఆటవస్తువులతో 

గడిపినప్పుడు సంతోషం .


స్నేహితులతో , సరదాలతో

 తీయని అనుభూతి ;

ఆహ్లాదకరమైతే నేర్చుకొనుట

 వలన మంచిమతి .


యువతులకు ఆకర్షణను తెచ్చేది

 సౌందర్యవంతమైన శరీరం ;

మంచి దుస్తులతో , ఆభరణాలతో

 ముఖం అరవిందం .


యువకుడిని హి - మ్యాన్ 

అంటే ఎంత ఉల్లాసం !

వినోద విహారాలతో వానికి

 అనుదినం మనోహరం .


ప్రియురాలికి ప్రేమతో

 గులాబీ అందితే సంతృప్తి ;

తనే సర్వస్వం అంటే

 ఆ ఉత్సాహానికి ఏది అవధి ?


ప్రియడికి మనసున్న మగువ 

వలపొక తీరని దాహం ;

తనే ప్రాణం అంటే అడగులోనే

 అడుగు జీవితాంతం .


వివాహానంతరం ఆలుమగలలో

 సుఖం అనుక్షణం ;

సంసారసాగరంలో 

తేలియాడటం గొప్ప లక్షణం .


ఉద్యోగమైనా , వ్యాపారమైనా

 జానెడు పొట్టకోసం ;

తగిన పరిశ్రమతోనే ఉన్నతమైన

 సౌకర్యాలు అదనం .


ప్రేమాభిమానాలతో అందరూ 

ఉంటే శోభాయమానమై ,

పులకించదా పుడమితల్లి 

ప్రతిఒక్కరి గుండెలో కొలువై !


ఎప్పుడైనా , ఎవరికైనా దుఃఖం

 ఉప్పొగితే ఎంతో కష్టం ;

ఆశించినది మనకు చేరనప్పుడు

 కాదా లోపల గాయం !?

*********



Rate this content
Log in

Similar telugu poem from Abstract