మనసుకు మాంగల్యం
మనసుకు మాంగల్యం
1 min
412
పచ్చని పందిళ్ళు
పసుపు దంచుతున్న రోళ్ళు
బంధువుల సందళ్లు
భోజనాలు ఘుమఘుమలు
గోరింటాకు పెట్టుకున్న చేతులు
పాలకొమ్మలు పసుపు ముద్దలు
పూలజడ పారాణి
బాసికాలు భజంత్రీలు
జీలకర్ర బెల్లం
మూడు ముళ్లు ఏడడుగులు
అగ్ని సాక్షిగా ఒక్కటైన అమ్మాయి అబ్బాయి
ఆలుమగలుగా అడుగులు ముందుకు వేస్తుంటే
అమ్మాయి మెడలోని మాగల్యం
అబ్బాయి మనసును ముహూర్తబలంతో కట్టుకుంటోంది
ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించమని ఆకట్టుకొమ్మంటోంది.