STORYMIRROR

ARJUNAIAH NARRA

Abstract

4  

ARJUNAIAH NARRA

Abstract

మనిషి ఉనికి

మనిషి ఉనికి

1 min
428


యుద్ధాలల్లో నేలకోరిగిన శిరస్సులను చూడు

అణు బాంబుల పేలుళ్లలో మరణించి నోళ్ళనుచూడు

మతఛాందస వాదుల మంటల్లో ఆహుతై నోళ్ళను

కరువు రక్కసికి బలియైన దీనులను చూడు

వైరస్ కోరల్లో ఊపిరి వొదిలి నోళ్ళను చూడు

విషవాయువుల లీకేజీలో చనిపోయినోళ్ళను చూడు

శ్మశాన వాటికల్లో జీవన సారమంత ఉంది చూడు


అనంత విశ్వంలో శూన్యంలో కలిసిపోయిన

అనుభవాల మూటలు విప్పిచూడు

ప్రకృతి ప్రళయాలకు మహాసముద్రంలో

మాయమయిన మనిషి జ్ఞాపకాలను వలవేసి పట్టు

భూకంపాలకు భూస్థాపితం అయిన జ్ఞానాన్ని

శిథిలాలలో వెదికి చూడు


ఆ నిశీధిలో నిర్మలమైన ఆకాశం వైపు చూడు

నిశ్శబ్దం బోధించే జీవిత పాఠాలు ఎన్నో

అర్ధించే చేతులు ఎన్నో

ఎదురు చూసే కన్నులు ఎన్నో

అర్తనాదలతో రోధించే గుండెలు ఎన్నో

కాలక్రమంలో కనుమరుగైపోయిన 

అభాగ్యుల, అనాధల, అమాయక జీవితాలు ఎన్నో


నిస్తేజం నిన్ను అవహించిన ప్రతిసారి

ఈ జీవితం నిర్వేదం అనుకొన్నప్పుడు

విరక్తితో ప్రాణం తీసుకోవాలనుకున్నప్పుడు

గతమంత తవ్వి చూడు

మానవత్వపు పరిమళాలు గుబాలిస్తాయి

రాజ్యాలను కోల్పోయిన మనిషి

సర్వ సంపదలను పోగొట్టుకున్న మనిషి

అన్ని కోల్పయినా మనిషి

జీవించాలనే ఆశను మాత్రం కోల్పోలేదు

అందుకే గతాన్ని గురించి బాధపడకు

భవిష్యత్ గురించి బెంగ పడకు

వర్తమానంలో విచారించకు

ఆత్మనిబ్బరంతో జీవించడం మొదలుపెట్టు

 



Rate this content
Log in

Similar telugu poem from Abstract