STORYMIRROR

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

మనిషి బతుకుతాడు

మనిషి బతుకుతాడు

1 min
139

గుప్పెడు గుండె

ఉప్పెనంత ఊహలను మోస్తూ

కాలమిచ్చే కఠినమైన తీర్పులకు

ఊరటనిచ్చే సమాధానమిస్తూనే వుంది

ఎన్ని ఉపద్రవాలను ఎదిరించలేదు

ఆశల్ని ప్రోది చేసి అందమైన 

భవితనివ్వడం తనకలవాటే

ఇప్పుడు మాత్రం ఏమయింది..?

జగమంత నాదేనంటూ

విస్తరిస్తూ విహరిస్తూ 

కల్లోలం సృష్టిస్తున్న కరోనాతో

నిశ్శబ్ద యుద్ధం చేస్తుంది

సూక్ష్మ క్రిమి సృష్టించిన

మహమ్మారితో యుద్ధం చేస్తుంది

దేహదేశంలో జరిగే అంతర్యుద్ధాన్ని

ఆత్మస్థైర్యమనే ఆయుధంతో

మనోధైర్యమనే మందుతో

ఆశల వనం నాటి వెలుగు రేకులు పూయిద్దాం

నిరాశ నిస్పృహలను తరిమి

చైతన్య దీపాలను వెలిగిద్దాం

మనిషిగా మన మనుగడను

ఆఖరి శ్వాస వరకు సాగనిద్దాం


Rate this content
Log in

Similar telugu poem from Fantasy