STORYMIRROR

Swarnalatha yerraballa

Inspirational

4  

Swarnalatha yerraballa

Inspirational

మహిళ నీకు వందనం

మహిళ నీకు వందనం

1 min
400

అవని అంచులనంటిన మహతి ఉన్న అతివలెందరు ఉన్నా

ఆ అవని గర్వించగల సుమతులెందరు ఉన్నా

ఈ ఇల యందు ఇంతి ఇంతే కదా అనే ఇంకితమున్న వారికి

ఇంతలో ఇమిడివున్న శక్తులతో సరి ఉత్తరువు ఇస్తున్న వనిత నీకు వందనం


ఆడపిల్ల ఆడ పిల్ల అనే సమాజపు ధోరణిలో

ఆలి అవ్వడమే అతివ లక్ష్యమన్న ఆలోచనలను దాటుకొని

వంటింటి కుందేలును ఊడిగపు ఊచలనుంచి విముక్తి చేసి

విద్యను వల్లించి విశ్వమునకు విద్యావాహినిలా నిలిచిన

ఓ విజ్ఞానదాయిని నీకు వందనం



కనురెప్పలు తెరవకనే కడుపుననే కడతేర్చే కఠిన సమాజంలోన

కాళరాతిరి కటిక చీకటి బంధనపు సంకెళ్ళను తెంచుకొని

దయగల ధన్వంతరిలా అశ్వస్థతకు స్వస్తి మంత్రం వేసి

అందరి మన్ననలను అందుకొనే మందరి అయిన

మహిళ నీకు వందనం 



విరిసి విరియని పువ్వుకు వివాహమనే ముళ్ళువేసే సమాజంలోన

విహంగంలా విహరించాలనే ఆశలకు అడ్డు చెప్పే సంస్కృతికి వీడ్కోలు చెప్పి

ఆకాశపు అంచులలో విహరిస్తున్న మేఘాలను సైతం ముద్దాడి చూపించి

అబ్బురపరిచే మెరుపులా మెరుస్తున్న మహిళ నీకు వందనం 




సజీవంగా ఉన్నా సహజీవి లేడంటూ సతీసహగమనాన్ని సమర్థించిన సమాజంలోన 

సతి కాక ముందే సఫలం సాధించిన సబలనని చెప్పి

సర్వజనులకు రక్షణగా రక్షణవలయమై నిలిచి

సమస్యలపై చట్టంతో స్వారీ చేసి శాంతిని పరిరక్షించే సబలా నీకు వందనం




ఏ నది తీరు అయినా సాగర తీరం చేరడమే అన్న ఆలోచన ధోరణిలోన

నదిలా కాక సాగరాన్ని దాటగల నౌకగా నిలిచి

అలల తాకిడి ఒడిదుడుకులకు ఒరగని తెరచాపై నిలిచి

సాగరానికి సైనికాధిపథ్యం చేస్తున్న సైవిక నీకు వందనం



గృహిణి అంటే గుమ్మం చాటు బంధీ అంటున్న సమాజంలోన

గృహిణి అంటే గృహ గార్ధభం కాదు గృహ రారాణి అని తెలిపి

తన శిక్షణతో శిఖరాగ్రములను చేరిన యోగ్యులను సమాజమునకు బహూకాంరించి

తల్లియై తరుణిలా తన నీడనిచ్చి సేద తీర్చే తరుణీమణీ నీకు వందనం


ప్రతి రంగంలో తన అడుగుజాడల రంగులను రంగరించి

ప్రతిభ ఎంతవున్ననూ ప్రకృతిలోని శక్తులులా 

ఒరిమిని వ్యవహరించి

ప్రతి రంగానికి తన నవపరిమళములను రంగరించి

ప్రకృతి శోభలా అందరికి ఉషోదయాన్ని పంచుతున్న పడతి నీకు వందనం 





Rate this content
Log in

Similar telugu poem from Inspirational