లోకం తీరు ఇంతేగా మరి
లోకం తీరు ఇంతేగా మరి
లోకం తీరు ఇదేగామరి!
కరవాలాలు దూసుకుపోయి
కుత్తుకలు కత్తిరించుకుంటున్నాయి
నెత్తురు చుక్క మాత్రం రాలదు
తడిగుడ్డ కత్తులపదును కుత్తుకలకే తెలుసు.
వెన్ను నిటారుగానే కనిపిస్తుంది
తూట్లు లెక్కించడం ఎవరితరమూ కాదు
వెనుతిరిగి చూసేలోపే వెన్ను
ఫెళ్ళున విరిగిపోయింది వెన్నుపోట్లుకి.
ఉపన్యాసాల్లో ప్రత్యర్థిని ఉరితీసేసాడు
ఆరా తీస్తే ఇద్దరూ రెండు ఒరల్లో...
ఒకే కత్తి మాదిరి లోపాయకారి ఒప్పందం.
ఒక గూటి పక్షి మరోగూటికి ఎగిరితే
అక్కడ ప్రకృతి వికృతిలా అనిపిస్తుంది
ఇక్క
డ ఏ గూటి పక్షి ఎక్కడకు ఎగిరినా
బ్రహ్మరథాలు నిత్యం వాకిట్లోనే.
డబ్బులున్న మనిషి చుట్టూ....
బంధుమిత్రుల సమూహ మూకలే
జేబు నిండుకుందని తెలియగానే...
అక్కడకు పిచ్చి కాకికూడా వచ్చివాలదు.
నలుగురూ వున్నారు పర్వాలేదన్నది భ్రమ
నలుగురికీ నీ వారసత్వ తాయిలాలే...
తాళింపులు అప్పుడే అంత్యక్రియలైనా
గుభాళించి ఘనంగా జరుగుతాయి.
భూమి సంగతి అటుంచండి
లోకం మాత్రం కాసుల చుట్టూ తిరిగి
పచ్చనోటుకి ఖాళీ ప్రోమసరీ నోట్ రాసి
దానికోర్టులో బంతై గెంతుతుంది.
.........