STORYMIRROR

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Drama Romance

4  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Drama Romance

వియోగాత్మ

వియోగాత్మ

1 min
305

నిన్ను నా ఆత్మ నుంచీ

నా హృదయాంతరాళాల్లోంచీ 

దూరం చేయాలనీ 

అదుపు లేకుండా నన్ను 

ముసురుకుంటున్న 

నీ ఆలోచనలని 

అదుపు చేయాలనీ 

నీ సాంగత్యాన్ని 

భ్రమింపజేస్తున్న 

మెరుపు కలలని

చెదరగొట్టాలనీ 

విఫలయత్నం 

చేస్తున్నాను నేను

నా ప్రయత్నం 

దృఢమౌతున్న కొద్దీ 

నీ మధురానుభూతులు 

నాలో భాగమై పోతున్నాయి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract