STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

సమయాన్ని వెనక్కు తిప్పలేం

సమయాన్ని వెనక్కు తిప్పలేం

1 min
331

తెలీనితనం కాదు

ఇది నిస్సంకోచంగా నిర్లక్ష్యం

నీకిష్టమొచ్చినట్లు చెట్లు నరికావ్

చెరువుల్లో భవనాలు నిలిపావ్


లెక్కకు మించిన వాహనాలు

తక్కువ కాని కర్బన ఉద్గారాలు

ఊపిరాడని నగరాలు

ఉక్కిరబిక్కిరైన ప్రాణాలు


భవిష్యత్తు అని చంద్రుణ్ణి చేరావ్

పక్క గ్రహాల మీద నీళ్ళు వెతికావ్

కానీ

నువ్వున్న చోటు చూసుకున్నావా

ఈరోజు ఆక్సిజన్ వెతుక్కుంటూ

రేపు మరోటి వెతుక్కుంటూ

నీ పరిస్థితి అవలోకనం చేసుకున్నావా


సమయాన్ని వెనక్కు తిప్పలేం

కానీ తిప్పలు రాకుండా

నీ ఆలోచనలు మార్చుకోవచ్చు

ప్రయత్నిస్తే మళ్లీ ప్రకృతి మనసు గెలవచ్చు

ఏమంటావ్


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract