ఆకలి రాజ్యం
ఆకలి రాజ్యం
శాలరీ సగమే అని విచారిస్తున్న ఉద్యోగి
పనులే లేవని వాపోతున్న అడ్డా మీద కూలీ
పొట్ట కూటి కోసం కూడా బయటకు రాలేని పూలమ్మి
డబ్బు కళ్ళ చూడలేని బిచ్చగాడు
ఎవరి చూపు పడిందో
మహమ్మారి కరోనా ప్రబలి
దేశం బతుకు చతికిలపడిందే
ప్రాణ వాయువును కొనేందుకు పోటీలు
స్మశానంలో చోటు కోసం పోటీలు
బ్రతకడానికో చావడానికో తెలీని అయోమాయపు పోటీలు
కాలమా
కడుపు తరుక్కుపోయేలా చేశావే
అన్నీ చేసినదానివి
ఆకలనే విషయాన్ని ఎందుకు మరిచావే
ఆకలి రాజ్యంలో మమ్మల్ని చూసి ఆనందపడ్డానికా
