STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

నిన్ను చూసాక

నిన్ను చూసాక

1 min
368

కాళ్ళ క్రింద భూమేం బద్దలు కాలేదు

కంటిలోని నీరు బయటికి రాలేదు

శ్వాసలో అలజడి వ్యక్తం కాలేదు

నిన్ను పలకరించేంత ధైర్యం రాలేదు


కానీ

మనసు లోపలి పొరల్లో ఎక్కడో కలుక్కుమంది

నువ్వు మరో వ్యక్తిని ఎంచుకోవడం చూసి

ఏదో పాత గాయాన్ని తక్కిన అనుభూతి

మానిపోబోయే ముందు మళ్లీ తిరగబెట్టిన రోగంలా

ఒళ్లంతా సలిపింది


అలా నిన్ను చూసాక

గుండె పగిలిన చప్పుడు

ఎక్కడని వెతికాను

సమాధానం దొరకలేదు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract