STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Romance

4  

Dinakar Reddy

Abstract Drama Romance

నా నవ్వే దీపావళి

నా నవ్వే దీపావళి

1 min
366

అప్పుడే దాటింది ఏడాది

ఎదురీతలో తెలీలేదు ఈసారి

వచ్చింది దీపావళి పండుగ

వీధుల్లో టపాకుల శబ్దం నిండుగా


మన ఇంటి ముందు మాత్రమే స్తబ్దుగా ఉంది

ఒంటరిగా వెలుగుతున్న దీపం రెపరెపలాడింది

అచ్చు నా మనసులా

ముందరి వాకిలి కర్టెన్ గుడ్డ ఓ అని ఎగురుతోంది

నా ఆశలాగా


అంతలో వీధి గుమ్మం దగ్గర నువ్వు కనబడ్డావు

ఉన్నపళంగా చీర సర్దుకుంటూ పరుగెత్తాను

నువ్వు నన్ను హత్తుకున్నావు

అసలైన పండగ నీ నవ్వుతో వచ్చింది


స్మశానంలా ఉన్న ఈ మనసులో

చెంగలువలు వికసించాయి

ఇద్దరం కలిసి బాణసంచా కాలుస్తూ

అమావాస్య రాత్రిని వెలుగులతో నింపేశాం


అప్పుడు చెప్పావు నువ్వు

నా నవ్వే దీపావళి అని

నేను కిలకిలమంటూ నవ్వేశాను

అని ఆమె దీపావళిని మళ్లీ గుర్తు చేసుకుంది


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract