వాట్సప్ మెసేజ్
వాట్సప్ మెసేజ్
ప్రతి రోజును రోజా పువ్వుల
తాజాగా ఉంచుకోవాలి
ప్రతి మాటకు తేనేలద్ది
బాధలను తీయ్యగా చేసుకోవాలి
మాటలు మనసుకు శక్తిని ఇస్తాయి
నా చెలితో.........
వాట్సప్ లో సందేశాలతో సంభాషణ.....
(నేను పంపిన సందేశాలను తొలగించి చూస్తే ఆమె సంభాషణ...... సారాంశం).
.... హలో.......
(typing..............)
ఏంటి....చెప్పు
నాకు పనుంది.....
This message was deleted.......
offline
బాగున్నా...
హి...హి..
మై స్వీట్ హార్ట్.......
offline
అ .........లేదు
హు...
(typing..............)
సరే...
చెప్పు......
కాదు....
చేసాం....
(typing........)
This message was deleted.....
typing............
ఓయ్..
బై.......
offline
అవునా
ఏమో....
చా.......
(typing........)
నో..నో...
సరే....
ఎం చేస్తా.
బై.......
అదే...
మంచిగానే ఉన్నది.
typing..............
బై.......
typing......................
OK.......
నాకు తెలియదు.....
అంటే...
మ్మ్......మ్మ్...
offline.........offline
హ...
వద్దు...
హ...
yes........
????
(typing.......)
ఎం చెయ్యను....
This message was deleted....
Offline......
నీ ఇష్టం......
నన్ను అడగకు......
!!!!
బై.......బై.....
********************
నా మాటల్ని తొలగించి చూస్తే.....
ఆమె మాటల్లో సందేశమే లేదు
మా మధ్య అసలు సరసమైన,రమ్యమైన
కమ్యూనికేషన్ జరగలేదు
యాంత్రికమైన జీవితం అనిపించింది......
తను స్ప్రుహలో ఉండి టైప్ చేసిందా? లేక
నేను మతి భ్రమించిన వాడిలా.... టైప్ చేశానా?
అని అనుమానం వచ్చింది
అపుడు అర్థం అయ్యింది నాకు ........
"I AM NOT A ROBOT" అని కంప్యూటర్లో ఎందుకు వస్తదో.... అని.
**********
ఒంటరితనం ఎంత బాధ పెడుతుందో...
ఎన్ని మనసులు విరిగి పోయాయో
ఎన్ని ఆలోచనలు వీకారాలుగా మారుతున్నయో
ఎన్ని హృదయాలు బరువెక్కి కుంగిపోతున్నాయో
ఎన్ని గొంతులు మూగ బోతున్నయో
ఎంత మంది సాఫ్ట్వేర్ మాంత్రికులు మాయమైపోతున్నారో
ఎంత మంది అంతర్జాతీయ అంతర్జాల
అవతారకులు అంతరించిపోయినారో.......
స్మశానంలో నిశబ్ద సంగీతంమైన ఇంపుగా ఉంటుంది
నీ రింగు టోన్ వింటుంటే నాకు గుండెపోటోచ్చింది
నీ నోటిఫికేషన్ సౌండ్ తో నా నోటి మాట పడిపోయింది
నీ అలారం శబ్దం నా శవ యాత్రను గుర్తుకు తెచ్చింది
చూడక కూర్చున్న నా ముడ్డి కింద నీవు మరిచిన
ఫోను బృం... బృం ...బృం..... ఆంటు వైబ్రేషన్
ఇక నైనా మేలుకో......
నిన్ను నీవు మలుచుకో నీ జీవన విధానాన్ని మార్చుకో
నీ భావాలకు తగ్గట్టుగా నిన్ను నీవు వొలుచుకో
నీలో నీ నుండి నీ యాంత్రిక బతుకును తోలుచుకో
కదానుకు నేస్తం.....
ఇక ఈ యాంత్రిక జీవితానికి శలవు............
అదిగో నా రాణి నా చరవాణికి........రింగుస్తున్నది
(ట్రింగ్.......ట్రింగ్....ట్రింగ్..ట్రింగ్...ట్రింగ్.....ట్రింగ్..
************************
సమీరం సుదూరం నుండి సంగీతాన్ని లీలగా మోసుకొచ్చింది.....
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లొ వున్నాడు...
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లొ వున్నాడు...
కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లొ వున్నాడు...
