STORYMIRROR

RAMESH B L N

Abstract Drama Inspirational

4  

RAMESH B L N

Abstract Drama Inspirational

అమ్మ అంటేనే అమృతగని..

అమ్మ అంటేనే అమృతగని..

1 min
545

అమ్మ అంటేనే అమృతగని..


మొదటిసారి బిడ్డను చూసినప్పుడు 

అమ్మ మోహంలో వెలుగుకు 

కోటి సూర్యులు సరితూగగలరా... 


తనే ఒక చల్లని ఆకాశం 

కానీ బిడ్డను మురిపించిి, మరిపించి 

గోరుముద్దలు తినిపించడానికి 

చల్లనయ్య చందమామను చూపిస్తూ 

అమ్మపాడే పాటలో 

రాగాల కన్నా మురిపాలే ఎక్కువ కదా!? 


అల్లరిచేస్తే బుచాడీ భయం పెట్టె అమ్మ 

నిజంగా ఆ బుచాడే వస్తే 

వాడి నీడనైనా తన బిడ్డపై పడనిచ్చేనా?? 


అమ్మకు అన్ని దాచడం అలవాటు 

బిడ్డకు చిన్న గాయమైన 

కంట నీరు నింపుకొనే అమ్మ..

తన వేలు తెగినా చేయి కాలిన 

మనకు తెలియనిచ్చేనా!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract